తేమతో సమస్య

వర్షాకాలంలో ఇంటి గోడలు, పగుళ్లు మీదుగా నీళ్లు కారి ఇల్లు తేమగా ఉంటుంది.కలపతో చేసిన తలుపులు వానకు బిగుసుకుపోతాయి.వాటి నట్లు సరిగ్గా బిగించాలి వార్నిష్ చేయటం సాండ్ పేపర్ ఉపయోగించిన ఫలితం ఉంటుంది.లేదా తలుపులు ఊడదీసి మళ్ళీ బిగించాలి ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డులు వైరు సరిగ్గా పని చేయకపోవటం వర్షాల్లో చూస్తూ ఉంటాం.వైర్లను సరిగ్గా పూర్తిగా కప్పి వేయడం వల్ల భద్రత ఉంటుంది.కబోర్డ్ లో నీరు తేమ వల్ల నాచు పెరగటం,కీటకాలు ఉండటం కనపడుతుంది. నాఫ్థలిన్ బిళ్ళలు,వేపాకులు లవంగాలు కప్ బోర్డ్ ల్లో ఉంచితే కీటకాలు పురుగుల బెడద ఉండదు.