చాలామంది మాటల్లో ఒక నిరాశ కనబడుతుంది ఎంతో అదృష్టం ఉంటేనే అన్ని పనులు అవుతాయి అంటారు.ఇలాంటి మాటలు మనిషిలో బద్ధకాన్ని చూపిస్తాయి ఒక ఉదాహరణ చెప్పుకుందాం బిధోవెన్ గొప్ప సంగీత విద్వాంసుడు.ఎనిమిదేళ్ళ వయసులోనే సంగీత కచేరీ చేశాడు 20 వ ఏటనే గొప్ప పియానో వాయిద్యకారుడిగా పేరు సంపాదించాడు రాగాలను రకరకాల పోకడలతో ఆలపించగా గల ఆ ఎక్సపర్ట్స్  కు నెమ్మదిగా వినికిడి శక్తి పోవటం మొదలైంది.ఆయన దాన్ని పట్టించుకోకుండానే సంగీత ప్రపంచంలోనే ఉండిపోయాడు అద్భుతమైన కంపోజిషన్స్ సృష్టించారు. అతని సృజన తో అతి గొప్పది మిస్సా సోలెమీనన్ ఈ రాగాన్ని కంపోజ్ చేశాడు ఇవన్నీ వినికిడి శక్తి పోగొట్టుకున్నాక సాధించిన విజయాలు.చెవులతో విని సంతోషించిన వలసిన సంగీతం ఆయన చెవుల్లో పడకుండానే లోక ప్రసిద్ధం అయింది. ఇక్కడ అదృష్ట దురదృష్టాలకు ప్రసక్తి లేదు. మనిషికి సృజనకు ఎలాంటి హద్దులు లేవని నిరూపించిన బిధోవెన్ ఆయన కంటే గొప్ప ఆదర్శం ఇంకొకటి కనిపిస్తుందా?
చేబ్రోలు శ్యామసుందర్ 
9849524134 
 

Leave a comment