బాల్కనీల్లో పెద్ద సైజు గులాబీల్లా కనపడే క్యాబేజీలు పూయిచండి అంటున్నారు ఎక్సపర్ట్స్. క్యాబేజీ,కాలి ఫ్లవర్ కేల్,బ్రోకలీ ఇవన్నీ కూడా బ్రస్సికా ఒలెరాసియా జాతికి చెందినవే పూల రంగులను బట్టి కలర్ అఫ్ పిజియన్, పీకాక్,ఒకాసా టోక్వా వెరైటీలు ఉంటాయి. అన్ని రకలోనూ చుట్టు ఉన్న ఆకులు ఆకుపచ్చ రంగు లోను మధ్యలో పువ్వులా రకరకాల రంగుల్లో విచుకోనట్లు ఉంటాయి. కుండీల్లో చామంతులతో పాటు వీటినీ పెంచవచ్చు. ఈ పువ్వుల క్యాబేజీ ని సలాడ్స్ సూపుల్లో వాడుకోవచ్చు. ఎన్నో పోషకాలు పీచు,విటమిన్-సి కాల్షియం తో నిండి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఈ పూల క్యాబేజీలు రకరకాల రంగుల్లో ఉన్న క్యాబేజీ విత్తనాలు చల్లితే అచ్చం గులాబీలు అమర్చిన పూల బోకేల్లాగా ఉంటాయి.

Leave a comment