ఇవి ఇలా తింటే ఆరోగ్యం

ఇవి తరచుగా తింటే ఆరోగ్యంగా ఉంటారంటున్నారు న్యూట్రిషనిస్ట్ లు. వారానికి నాలుగు సార్లు ఆకుకూరలు తినాలి అలసందలు మొదలైనవాటిని వారానికి రెండుసార్లు స్నాక్స్ లాగా తినాలి. వారానికి మూడుసార్లు తెల్ల నువ్వులు ఉండలు,పల్లీల ఉండలు బెల్లంతో తయారు చేసినవే తినాలి. నెయ్యి బెల్లం కలిపిన సున్నుండలు చాలా మంచిది. ఆయా కాలాల్లో దొరికే పండ్లను వారానికి రెండుసార్లు తినాలి.నానబెట్టిన బాదం పప్పు స్నాక్ లాగా తినాలి. పరిమితంగా జీడిపప్పు, పిస్తా పప్పు తినాలి. అవన్నీ వేడిగా ఉన్నప్పుడే తినాలి. వేరుశెనగలు సెనగలు నాననిచ్చి ఉడకబెట్టి తినాలి.