ఇదేం కష్టం కాదు

మనదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణీలు కాన్పు రోజు వరకూ కూడా ఇంటిలో బయట పొలాల్లో పని చేస్తారు.డెలివరీ తరువాత వెంటనే ఇంటి పనులు బిడ్డ పనులు చూసుకుంటారు.మూడు వారాల వయసున్న పాపను చూసుకుంటూ ఆఫీస్ పనిచేసుకోవటం నాకేం కష్టం కాలేదు అంటారు సౌమ్య పాండే. కరోనా సమయంలో అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న అధికారులు చాలామందే ఉన్నారు వారిలో ఉత్తరప్రదేశ్ లోని మోదీ నగర్ జిల్లా కలెక్టర్ సౌమ్య పాండే ఒకరు.మూడు వారాల క్రితం ఆడపిల్లలకు జన్మ ఇచ్చారు. ఆమె ప్రసూతి సెలవులు తీసుకోలేదు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవ్వగానే తన కార్యాలయానికి వెళ్లి విధుల్లో నిమగ్నమయ్యారు మాతృత్వాన్ని ఆస్వాదిస్తూనే ఉద్యోగ బాధ్యతలు చూస్తున్న సౌమ్య వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిన్న పాపను లాలిస్తూ అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా సౌమ్య పాండే ను అందరూ అభినందిస్తున్నారు.