తొలి పిల్లల దినపత్రిక

ఎంతమంది పిల్లలు ఇళ్ళలో లేవగాఅనే న్యూస్ పేపర్ చదువుతున్నారు. ఎంత మందికి సమకాలీన రాజకీయాలు ప్రపంచ ధోరణి గురించి తెలుసు. వాళ్ళకు జనరల్ నాలెడ్జ్ ఎలా వస్తుంది ఇలాంటి ప్రశ్నలకు సమాధానం వెతికింది గురుగ్రామ్ కి చెందిన నిధి అరోరా. ఆమె ఆరేళ్ళ కొడుకు గురించి చిల్డ్రన్ పోస్ట్ మొదలుపెట్టింది. అది ఇవ్వాళ దేశంలో తొలి పిల్లల దినపత్రిక గా పేరు తెఛ్ఛుకుంది. 2017 జూన్ 21న నిధీ అరోరా 4 పేజీలతో ఒక పత్రిక విడుదల చేశారు.ఈ పేపర్ పీడీఎఫ్ రూపంలో సబ్ స్క్రైబర్స్ కి అందుతుంది. పిల్లలు ఆసక్తిగా చదివే ప్రతి విషయం ఒక కామిక్ కథతో పాటు ఈ చిల్డ్రన్స్ పోస్ట్ లో ఉంటున్నాయి.