సంప్రదాయపు అందం

వందల సంవత్సరాల నాటి నగలి ఇవ్వాళ్టి ఫ్యాషన్ పోకడలో భాగం అవుతున్నాయి. యాంటీక్ డిజైన్స్ ఇవ్వాళ్టి యువతకు ఫ్యాషన్ స్టేట్ మెంట్స్. చక్కని పని తనంతో ఫినిషింగ్ తో ఉండే ఈ నగలు భారీగా హుందాగా ఎలాంటి సందర్భాలకైన అందం ఇస్తున్నాయి. కర్ణాటకకు చెందిన గజి అడిగై బోకర్ పనితనం అద్భుతం. చిన్న చిన్న బంగారు గుళ్ళతో ఏదైన వరసలో అవి ధరించిన వాళ్ళ టేస్ట్ ని, హోదా ని చెప్పేస్తాయి. అన్ కట్ డైమాండ్స్ రుబీలు పొదిగిన ఈ గజి అడిగై బోకర్ వేడుకల్లో మెరిసిపోతుంది.ఈ రూబీలు,కుందన్లు రెండు మూడు వరసల్తో గజ్జెలతో ఈ సాంప్రదాయ నగ కళ్ళను కట్టేస్తుంది.