ఇలాంటి ఉత్తములైన ఉపాధ్యాయులుండాలి. అప్పుడే పిల్లల జీవితాలు వికసిస్తాయి. షెర్లీ పాల్ అంధేరా లోని ఎం. ఏ హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు. 2013 లో యోగీస్ యాదవ్ అనే అసిస్టెంట్ టీచర్ ఆ స్కూల్ లోని 40 మంది టెన్త్ విద్యార్థులను లైంగికంగా వేధించాడు. అతని వేధింపులు స్కూల్ యాజమాన్యం  వెళ్లినా  స్కూల్ ప్రతిష్ట దెబ్బతింటుందని దాచివుంచాడు. పైగా విద్యార్థినులకు కుడా  నోరెత్త వద్దని హెచ్చరించారు. షెర్లీ పాల్  ఊరుకోలేదు. సాక్ష్యాధారాలతో సహా పోలాన్  కేస్ పెట్టారు. కోర్టు అతన్ని మూడు నెలల పాటు జ్యూడిషియల్ కష్టడీకి పంపారు. అతన్ని మళ్ళి స్కూల్ యాజమాన్యం ఉద్యోగంలోకి తీసుకుంది. తాను ఆంక్షలను ధిక్కరించినందుకు గానూ షెర్లీ పాల్ ను ఉద్యోగంలోంచి తీసేసింది. ఈ చర్య అక్రమం అని షెర్లీ పాల్ రెండేళ్ల పటు న్యాయ పోరాటం చేసారు. రెండేళ్ల పాటు జీతం లేక  ఆమె ఆర్ధికంగా కృంగిపోయారు కూడా . అనారోగ్యంతో ఉన్న తల్లికి మందులు కుడా కొనలేక పోయారు. వాయిదాలకు వెళ్లారు. పోరాడారు. ఇటీవలే కోర్టు ఇచ్చిన తీర్పు వచ్చింది. ఆమె మళ్ళీ ఉద్యోగంలో చేరారు. బాధిత విద్యార్థినులు జాబ్ అయిపోయి ఉన్నత విద్యకు వెళ్లిపోయినా  తనకోసం పోరాడిన షెర్లీ పాల్ కు కృతజ్ఞతలు చెప్పారట. 

Leave a comment