నేను కొత్తగా ఏం చేస్తున్నాను. నటనలో నేను సాధించవలిసిన మెట్లు ఎన్నున్నాయి అని ప్రశ్నించుకున్నాను. అప్పుడిక అమ్మాయిలను గౌరవించే పాత్రలనే చేయలనిపించింది అంటుంది నయనతార. అలాంటి స్క్రిప్టులు వినటం మొదలుపెట్టాను. నా ఇష్టాన్ని ఆలోచనను ప్రేక్షకులు స్వాగతించారు.నా సినిమాలు ఆదరించారు. అలాంటి సినిమా నిర్మించేవాళ్ళు ముందుకొచ్చారు. మహిళ ప్రాధాన్యం గల సినిమాల సంఖ్య ఇప్పుడు పెరుగుతుంది. ఇందుకు ప్రేక్షకులకు కృతజ్ఞ్తలు చెప్పాలి అంటుంది నయనతార. సినీ పరిశ్రమ ప్రేక్షకుల అభిరుచి జడ్జిమెంట్ల పైనే ఆధారపడి ఉంటుంది. మంచి సినిమాలు అందున స్త్రీ ప్రాధాన్యత కలిగిన సినిమాలు వస్తున్నాయంటే ప్రేక్షకులే కారణం అంటుంది నయనతార.

Leave a comment