వరసల గొలుసుల అందం

మెడలో వరసల హారాలు చక్కగా ఉంటాయి. ఇప్పుడు మరిన్ని హారాలు బరువైన నగలు కూడా వచ్చాయి. అవి ఎప్పుడు ఫ్యాషన్. అయితే అదే హారాలు ఇప్పుడు జడకు ముడికి ,దువ్వి వదిలేసిన జుట్టుకు తగిలిస్తున్నారు.ముత్యాలు ,రంగు రాళ్ళు ,సాధారణంగా బంగారు గొలుసులు కూడా ఇవ్వాళ్టి ,హెయిర్ యాక్ససరీస్ అయ్యాయి. పండుగ సందర్భాలు,లేదా ఏదైనా ప్రత్యేక సందర్భాలకు ఇవి అందంగా కనిపిస్తాయి. ఇది ధరించటం పెద్ద కష్టం కాదు .చక్కగా చిక్కుల్లేకుండా దువ్వుకొని జుట్టు చెదరకుండా పిన్నులు పెట్టుకొని ఈ బంగారు వరసల హారాలు తగిలించుకొంటే చాలు చక్కగా ఉంటాయి.