కొందరికి తేలిగ్గా గాయలు మానవు.. పెద్ద వయసులో గాయాలైనా ఒక పట్టాన మానిపోవు. ఈ విషయం పైన రాక్ ఫెల్లర్ విశ్వవిద్యాలయ పరిశోధకులు సుదీర్ఘకాలం అధ్యయనం నిర్వహించారు. సాధారణంగా గాయం తగలగానే శరీరం వెంటనే దాన్ని బాగు చేసేందుకు తగిన చర్యలను చేపడుతుంది. చర్మం పైన గాయం అయినప్పుడు అడుగుభాగంలో కెరోటినో సైట్స్ అనే కణాలు చేరుకొని కొత్త చర్మం ఏర్పాడేందుకు సహాకరిస్తాయి. ఈ కెరోటినో సైట్స్ గాయం ఏర్పడిన భాగంలోకి చేరుకోగానే స్కింట్స్ అనే ప్రోటీన్ ను ఉత్పత్తి చేస్తాయి. ఈ స్కింట్స్ రోగనిరోధక శక్తికి సాయపడుతున్న కణాలకు కొత్త చర్మం ఏర్పడేలా సహాకరిస్తాయి. కొందరిలో ఈ స్కింట్స్ ఉత్పత్తి తక్కువగా ఉంటే గాయం మానదు, వృద్దులలో ఈ సామార్థ్యం తగ్గిపోతూ ఉంటుంది కనుక గాయాలు ఒక పట్టాన మానవు.

Leave a comment