వెలుగుని ఆహ్వానించాలి

అపార్టుమెంట్ కల్చర్ తో తలుపులు వేసే వుంచాలి. ఉండేదే ఒక్క వాకిలి ,ఒక్క సిట్టింగ్ ఏరియా అన్ని తలుపులు వేసుకొని దీపాల కింద కాలక్షేపం ,ఇక ఆఫీస్ లో సెంట్రల్ ఎ.సీ.లో ఒక్క సూర్య కిరణం కూడా తాకకుండా పని చేస్తాం. రాత్రి కాగానే నిద్ర రావటం ,వెలుతురు మీద పడగానే లేవటం అన్నది ప్రకృతి సహాజమైన జీవ గడియారం పని తీరు. మరి ఆ అవకాశం దూరం చేసుకొని రాత్రి పగలు తేడా లేని విద్యుద్దీపాల కింద జీవించటం వల్లనే అనారోగ్యాలు ,కండరాలు బలహీనపడటం ,ఎముకలు పెలుచుబడటం,రోగనిరోధక వ్యవస్థ పూర్తిగా పాడవటం వంటి సమస్యలు వస్తున్నాయని అధ్యయనాలు గుర్తించాయి. ఉదయం నిద్ర లేవగానే కిటికీలు ,కర్టన్లు పక్కకి తీసి సాధ్యమైనంత వెలుగుని ఆహ్వానించటం ఆరోగ్యం అంటున్నారు.