వెండి నగలే అందం

ఫ్యాషన్ జ్యూవెలరీ లిస్ట్ లో వెండినగలు ముందే ఉంటాయి. చక్కని కంచిపట్టు చీరెల పైకి కూడా వెండినగలే అందం అంటారు స్టైలిస్టులు. మామిడి పిండేలు,కాసుఅల హారాలు,గుట్ట పూసల గొలుసులు పొట్టినెక్లెస్ లు ఏ వైన సరే తెల్లని వెండినగలు తక్కువ ధరలో ఎంతో అందాన్ని తెస్తాయి. చేనేత చీరతో మోడ్రన్ లుక్ లో వెలిగిపోవాలనుకుంటే కూడా పెద్దపెద్ద లాకెట్లతో ఉండే వెండి హారాలు,చోకర్స్ టెంపుల్ జ్యూలరీ చక్కగా ఉంటాయి.ఇంతెందుకు సింపుల్ లుక్ కోసం కాలేకీ అమ్మాయిలు తెల్లని కుర్తీలు కలర్ ఫుల్ స్టోల్ వేసుకుని వెండినగలు ధరిస్తే చాలు. వెండి నగలు ధరల విషయంలో కూడా అందుబాటులో ఉంటాయి.అమ్మాయిలు ధరించే ఇంకో వెస్ట్రన్ స్టైల్ డ్రెస్ లకు ఆక్సీడైజ్డ్ సిల్వర్ జ్యూలరీ చాలా బాగా నప్పుతాయి.