వేసవి లో వచ్చిందంటే ఎంత ఎసీల్లో ఉన్న ప్రభావం ఇటు శరీరం పైన అటు ముఖ చర్మం పైన పడక తప్పదు. చర్మం తాజాగా ఉంటుందంటే ఎక్కువ మంచి నీళ్ళు తగాల్సిందే. అలాగే శారీరక వ్యవస్థ డీ హైడ్రేడ్ అవ్వడం వల్ల అనేక రుగ్మతులు చుట్టు ముట్టే పరిస్థితి వుంటుంది. శారీరక ఉష్ణోగ్రత మెయిన్ టెయిన్ చేయాలంటే మంచి నీళ్ళు తాగడమే ఉత్తమం. ఇది సహజమైన డిటాక్సి ఫయర్. ఉదయం వేళల్లో నీరు తాగడం వల్లరోజంతా అలసట, బద్ధకం డిహైడ్రేషన్ వుండదు. స్వేదం వల్ల శరీర ఖనిజాలనీ కోల్పోతుంది. దీని వల్ల నీరసం అనిపిస్తుంది. ద్రవ పదార్ధాలు ఫిట్ గా వుండేందుకు సహకరించడం కాకుండా శరీరానికి పోషకాలు ఫిట్ గా వుండేందుకు సహకరించడం కాకుండా శరీరానికి పోషకాలు అందిస్తాయి. శారీరక వ్యవస్థలో అరవై శాతం నీరే వుండటం వల్ల జీర్ణ వ్యవస్థ, ముత్ర పిండాల పని తీరుకు మంచి నీటి అవసరం వుంటుంది. శరీరం నుంచి విషతుల్యతలు బయటకు పోయేందుకు నీరె కావాలి. అనారోగ్య కరమైన చిరుతిండ్లు తిన్నప్పుడు ఎక్కువ నీరు తాగితే రాష్ట్ర భావాల గురించి భయం అక్కర్లేదు. అనేక వేసవి పండ్ల వల్ల కూడా నీటిని భర్తీ చేయొచ్చు. పుచ్చ, కమలా, నారింజ ఈ సీజన్ కు మంచి ప్రత్యామ్నాయాలు.

Leave a comment