నీళ్ళు తాగాలని తెలుసుకానీ అది ఆచరణలో కష్టం అయిపోతుంది. నీటి ఆధారిత పండ్లు,కూరగాయలు తింటూ వుంటే శరీరానికి నీటి అవసరం కొంత తీరుతుంది. కనీస మాత్రమే క్యాలరీలు కడుపు నిండిన భావన కలుగుతుంది. కీరాలో 96.7 శాతం నీరే ఉంటుంది. విటమిన్ సీ,కెఫెక్ యాసిడ్ వంటివి చర్మాన్ని చక్కగా పరిరక్షిస్తాయి.కొత్తిమీరలో 95.4 శాతం నీరు ఉంటుంది.కరగని పీచు కలిపి శరీరాన్ని చల్లబరుస్తుంది.ముల్లంగిలో 95.3 శాతం నీరు ,క్యాప్సికలంలో 93.9 శాతం నీరు,కాలిఫ్లవర్ లో 92.1 శాతం పుచ్చకాయలో 91.5 శాతం నీరుంటుంది. కూరగాయలతో పోలిస్తే పండ్లలో క్యాలరీలు శాతం ఎక్కువే. కనుక సర్వింగ్ లు పోర్షన్ల పై ఒక దృష్టి ఉంచి ఈ నీరున్న పండ్లు కూరగాయలు డైట్ లో భాగంగా ఉంటే నీరు సమృద్దిగా శరీరంలో చేరినట్లు అనుకోవచ్చు.

Leave a comment