పోషకాలు ఉన్న పదార్ధాలు తినడం పెద్ద కష్టమేమి కాదు. కొద్ది సమయం కేటాయించవల్సి ఉంటుంది అంతే. పెసర మొలకలు,నిమ్మరసం,ఉప్పు కలిపి పెట్టుకుని అప్పుడప్పుడు తినవచ్చు. రాగి జావ,మజ్జిగ,పాలు,బెల్లం ఎలా తాగిన మంచిదే. అవిసె గింజల పొడి చేసి పెట్టుకుని పాలల్లో కలుపుకుని తాగవచ్చు,లేదా ఇతర పదార్ధాల పైన చల్లుకుని తినవచ్చు వాటి వల్ల ఓమెగా త్రీ ఫ్యాటీ అమ్లాలు అందుతాయి. పొద్దుతిరుగుడు పువ్వు విత్తనాలు,గుమ్మడి విత్తనాలు తెచ్చుకుని రోజుకు రెండు స్పూన్లు తింటే చాలు.కాఫీ,టీలతో పాటు ఒకటి రెండు సార్లు గ్రీన్ టీ తాగవచ్చు. వెన్న లేని పాలతో ఉడికించిన కప్పు ఓట్స్ చాలు. సాధారణమైన బియ్యంలో కొర్రలు కలిపి వడుకోవచ్చు. ఆవిరి పైన ఉడికించిన కూరగాయలు పప్పు,పెరుగు వంటివి తప్పనిసరిగా తినవచ్చు. రెండు మూడు రంగుల కూరగాయలను కలిపి వండుకుంటే పోషకాలు సంపూర్ణంగా అందినట్లే.

Leave a comment