బ్లాక్ హెడ్స్ ముక్కు చుబుకం వీపు బుజాలపైన కూడా వస్తాయి. స్వేద గ్రంధులు నుంచి నూనె అధికంగా ఉత్పత్తి కావటం శరీరం పైన బాక్టీరియా ఏర్పడటం వల్ల ఇవి వస్తాయి. గుడ్డు తెల్ల సొన తీసుకొని అందులో నిమ్మరసం కలిపి ఈ మిశ్రమం బ్లాక్ హెడ్స్ పైన రాయాలి. అది ఆరాక మళ్ళీ పూయాలి, అలా నాలుగైదు సార్లు పొరలుగా పూసి ఆరనివ్వాలి. బాగా ఎండి నట్లు అయ్యాకా దాన్నీ చేత్తో నెమ్మదిగా లాగేస్తే ఆ పొరతో పాటు బ్లాక్ హెడ్స్ ఊడి వస్తాయి. తెనే నిమ్మరసం కలిపి బ్లాక్ హెడ్స్ పైన రాసి ఆరిపోయాక వేడి నీటితో కడిగేయాలి. ఇలా రోజూ చేసినా బ్లాక్ హెడ్స్ పోతాయి. ఈ చిట్కాలతో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే సమస్య కూగా లేదు.

Leave a comment