Categories
Soyagam

ఉప్పు నీళ్ళతో జుట్టుకు ముప్పు.

జుట్టు వుడి పోవడం అన్న కాంప్లెయింట్ పది మంది లో తొమ్మిది మంది చేస్తూ ఉంటారు. పోషకాహార లోపం, వాడే ఉత్పత్తులు ఇవన్నీ కారణాలుగా చెప్పుకుంటాం. కానీ ఇప్పుడు ఎక్స్ పర్ట్స్ మీరు వాడే నీరు ఉప్పు నీరేమో చూసుకోండి అంటున్నారు. ఆ నీటి తో స్నానం చేయడం వల్లనే జుట్టు బలహీన పది ఊడిపోతుంది అంటున్నారు. ఈ నీటి లో వుండే ఖనిజ లవణాలు తలకు హాని చేస్తాయి. వెంట్రుకలు బలహీన పరుస్తాయి. చివర్లు చిట్లి పోయి వుదిపోతాయి. వాడుతున్న నీటి లో రసాయినాలు వున్నాయేమో టెస్ట్ చేయించుకొంమంటున్నారు  ఎక్స్ పర్ట్స్. ఒక మగ్గు నీళ్ళలో సబ్బు వేసి నురగ వచ్చేలాగా కలపాలి. నురగ వస్తే కఠిన జాలం కాదని, నురగ రాకపోతే ఆ నీటితో స్నానం చేయకూడదు. రాసాయినాలు కలిసిన షాంపూలు ఎంత ప్రమాదమో ఉప్పు నీళ్ళు అంతే ప్రమాదం అంటున్నారు ఎక్స్ పర్ట్స్.

Leave a comment