‘సిల్వర్‌ నట్‌ ట్రీ’ ఇమేజెస్ చూస్తుంటే అవన్నీ ప్లాస్టిక్ బాటిళ్ళు , మూతలు, పాత వస్తువులు, వ్యర్థాల నుంచి తయారు చేసిన వస్తువులా అనిపించవు.   బెంగళూరుకు చెందిన రితూ పర్ణా దాస్‌, ఏంజెలీనా బాబు అనే ఇద్దరు మహిళా వ్యాపారవేత్తలు పనికిరాని వస్తువులతో నగలు, గృహలంకరణ వస్తువులు తయారు చేస్తున్నారు.    గాజుబాటిళ్లు, రేకుమూతలు, టైర్లు, ట్యూబ్‌లు, వాషర్లు, బోల్టులు, ప్లాస్టిక్‌ సీడీలు లాంటి రకరకాల పాత వస్తువులతో నెక్లెస్, లాకెట్‌లు, చెవిరింగులు, మురుగులు, ఉంగరాల లాంటి ఆభరణాలు, రకరకాల గృహలంకరణ వస్తువులు చేస్తారు.   వాళ్ళ స్వంత బ్రాండ్‌ పేరు  ‘సిల్వర్‌ నట్‌ ట్రీ’ .    ఆన్ లైన్ రిటైల్ స్టోర్స్ లో వాళ్ళ ఉత్పత్తులను విక్రయిస్తారు. మూడేళ్ళలో 12 వేల బాటిళ్ళతో వస్తువులు తయారు చేశారు ఈ పారిశ్రామిక వేత్తలు.

 

Leave a comment