ఈ కెరీర్ లో అడుగుపెట్టి 20 ఏళ్లు అవుతోంది నా ఎత్తు, రంగు చాలామంది హీరోయిన్ లకు మ్యాచ్ అవటంతో వాళ్లకు  డూప్ గా 250 సినిమాల్లో స్టంట్ ఉమెన్ గా పని చేశాను.ప్రపంచ వ్యాప్తంగా ధైర్యసాహసాలలో స్టంట్ చేసే వాళ్ళకి అందించే  టారస్ వరల్డ్ ఆవార్డ్ కు మూడు సార్లు నామినేట్ అయ్యాను అంటోంది స్టంట్ ఉమెన్ సానో బార్. ఇదే కెరిర్ గా కావాలని  కోరుకోవటం వల్ల మిక్సడ్  మార్షల్ ఆర్ట్స్, బైక్ రేసింగ్, స్టాంట్స్ కిక్ బాక్సింగ్, స్కై డ్రైవింగ్, పారా గైడింగ్ , డీప్సి సీ డ్రైవింగ్ వంటి వాటిలో శిక్షణ తీసుకున్న వ్యాయామాలు చేస్తూ ఫిజియాలజీస్ట్ గా, న్యూట్రిషనిస్ట్ గా కూడా నైపుణ్యాలు  సాధించుకున్న ఈ రంగంలో మహిళలు తక్కువే అంటోంది సానో బార్.

Leave a comment