ఒక కంపెనీ ఇమేజ్ ని పెంచటంలో మహిళా ఉద్యోగుల పాత్ర కీలకం అంటోంది డెల్లాయిట్ సంస్థ చేసిన సర్వే. 2017 లో చేసిన అధ్యయనంలో ఉద్యోగాలలో మహిళల సంఖ్య పెరగటం ,అది కూడా విభిన్న భాషలు,సంస్కృతులకు సంబంధించిన మహిళలు ఆఫీసులో ఉండటం వల్ల సంస్థకు ఎక్కువ ప్రయోజనం అని సర్వే చెపుతుంది. కొత్తగా ఆలోచించటం ఉత్సహాంగా పని చేయటం సమస్యలను ముందుగానే గుర్తించటం తగిన విధంగా స్పందిచటం ఆరురెట్లు అధికం అని తేల్చారు.భావవ్యక్తికరణ మెరుగ్గా ఉండటం ,వినియోగదారులను ఒప్పించటం,సమస్యలను సహనంతో వినటం ,మహిళా ఉద్యోగులు మెరుగ్గా చేస్తారు.వీరు మెరుగైన మెనేజర్లుగా వ్యవహారిస్తారు.ఒకే సమయంలో పలు బాధ్యతులు చేపట్టగల నేర్పు మహిళలో ఉంటుంది. కానీ 2016 నాటి ప్రపంచబ్యాంక్ నివేదిక మన దేశంలో సమర్థతకలిగిన మహిళల్లో 27శాతం మాత్రమే ఏదో రకమైన ఉద్యోగం చేస్తున్నారని చెపుతుంది.

Leave a comment