Categories
అందాల తారలు ధరిస్తేనే కొన్ని కళలకు అందం నిండు దనం,ప్రచారం వస్తాయి. సౌదీ అరేబియాలో జాయ్ అవార్డ్ వేడుకల్లో అలియా భట్ కట్టుకొన్న అజ్రక్ బ్లాక్ ప్రింటింగ్ చీరె అలాగే పాప్యులర్ అయిపోయింది. అందరి దృష్టి ఆకర్షించిన ఈ కళ రాజస్థాన్ లోని కచ్ ప్రాంతం లో శతాబ్దాల నుంచి ఉంది. నీలం, ముదురు, కాషాయి రంగుల్లో సహజమైన రంగులతో పెయింట్ చేసే ఈ కళ కు ఎంతో ఓపిక నైపుణ్యం కావాలి. అజ్రక్ ప్రింటింగ్ రోజుల తరబడి పనిచేస్తేనే పూర్తవుతుంది. అందుకే ఖరీదు కూడా చాలా ఎక్కువే ఉంటుంది.