నీహారికా, మహిళా దినోత్సవం రోజున నాకేం చెప్తావు. ఏదో కొత్తదై వుండాలి. నీ జీవితం గుర్తు పెట్టుకొనేదై వుండాలి అన్నావు. సరే విను, ఇవాల్టి ఆధునిక మహిళ మూడు ప్రపంచాల పౌరురాలు. గడప దాటేదాక భర్త, ఇల్లు, పిల్లలు దాటాకా ఆఫీస్ కెరీర్ పోటీ ఇన్ని పాత్రలకు ఎంతో కష్టంతో న్యాయం చేస్తోంది. ఎక్కడ తేడా వచ్చినా అది వైఫల్యమే. ఇన్ని బాధ్యతల మధ్య చిరునవ్వుతో తనకు తాను నిరూపించుకోవాలంటే ముందస్తుగా ఆరోగ్యంగా ఉండాలి. అoదుకే వేళకు సరిగ్గా తినమని చెప్పాలనిపిస్తుంది. శరీరానికి వ్యాయామం, కంటినిండా నిద్ర, మెదడుకు విశ్రాంతి కావాలి.నువ్వు ప్రపంచం గెలవలే కానీ కెరీర్ మహిళవు కావచ్చు. పిల్లల చదువులు, పెళ్ళిళ్ళని తపించే మామూలు అమ్మవీ కావచ్చు. ఏం సాధించాలన్నా ఆరోగ్యంగా వుండాలి. ఆర్ధరైటీస్ తో నీ ఉద్యోగమూ చేయలేవు, నీరసంతో సేవలూ చేయలేవు, అనారోగ్యంతో ఏ సంతోషాన్ని సంపూర్ణంగా అనుభవించలేవు. పరిశోధనలు ఏం చెపుతున్నాయంటే గ్రామాల్లో స్త్రీలు 80 శాతం రక్తహీనతతో వున్నారు. సగంమంది భారతీయ మహిళలకు ఎయిడ్స్ అంటేనే తెలియదు. లక్ష ప్రసవాలకు ఐదు వందల మరణాలున్నాయి. ఏటా లక్ష రొమ్ము కాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. సగానికి సగం మహిళలకు హైపర్ టెన్షన్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా కోటి మంది డిప్రెషన్ బారిన పడుతున్నారు. ఈ లెక్కలకు సమాధానం చెప్పమ్మా. పురుషాధిక్య సమాజానికి సమాంతరంగా స్త్రీల ప్రాధాన్యతా క్రమాలు మారాయి. నిజమే నువ్వెంతో సాధించాలి. ఇంకా సాధిస్తావు కనుక నీ ఆరోగ్యం గురించి కాస్త ప్రాధాన్యం ఇచ్చుకో. నీ స్వభావం మార్చుకో. సున్నితం గానే ఉండు. కానీ ఆరోగ్యంగా ఉండు. తమ ఆకలి పట్టించుకోని, ఆరోగ్యం పట్టించుకోని, ఎప్పుడూ కుటుంబ శ్రేయస్సే ఆలోచించే మహిళా లోకం అందరికీ హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. నీహారికా ఇది నువ్వు గుర్తుంచుకోదగిన కానుకే అనుకొంటాను.
Categories
Nemalika

ఆరోగ్యo జాగ్రత్తమ్మా – నిన్ను నువ్వయినా పట్టించుకో

నీహారికా,

మహిళా దినోత్సవం రోజున నాకేం చెప్తావు. ఏదో కొత్తదై వుండాలి. నీ జీవితం గుర్తు పెట్టుకొనేదై వుండాలి అన్నావు. సరే విను, ఇవాల్టి ఆధునిక మహిళ మూడు ప్రపంచాల పౌరురాలు. గడప దాటేదాక భర్త, ఇల్లు, పిల్లలు దాటాకా ఆఫీస్ కెరీర్ పోటీ ఇన్ని పాత్రలకు ఎంతో కష్టంతో న్యాయం చేస్తోంది. ఎక్కడ తేడా వచ్చినా అది వైఫల్యమే. ఇన్ని బాధ్యతల మధ్య చిరునవ్వుతో తనకు తాను నిరూపించుకోవాలంటే ముందస్తుగా ఆరోగ్యంగా ఉండాలి. అoదుకే వేళకు సరిగ్గా తినమని చెప్పాలనిపిస్తుంది. శరీరానికి వ్యాయామం, కంటినిండా నిద్ర, మెదడుకు విశ్రాంతి కావాలి.నువ్వు ప్రపంచం గెలవలే కానీ కెరీర్ మహిళవు కావచ్చు. పిల్లల చదువులు, పెళ్ళిళ్ళని తపించే మామూలు అమ్మవీ కావచ్చు. ఏం సాధించాలన్నా ఆరోగ్యంగా వుండాలి. ఆర్ధరైటీస్ తో నీ ఉద్యోగమూ చేయలేవు, నీరసంతో సేవలూ చేయలేవు, అనారోగ్యంతో ఏ సంతోషాన్ని సంపూర్ణంగా అనుభవించలేవు. పరిశోధనలు ఏం చెపుతున్నాయంటే గ్రామాల్లో స్త్రీలు 80 శాతం రక్తహీనతతో వున్నారు. సగంమంది భారతీయ మహిళలకు ఎయిడ్స్ అంటేనే తెలియదు. లక్ష ప్రసవాలకు ఐదు వందల మరణాలున్నాయి. ఏటా లక్ష రొమ్ము కాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. సగానికి సగం మహిళలకు హైపర్ టెన్షన్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా కోటి మంది డిప్రెషన్ బారిన పడుతున్నారు. ఈ లెక్కలకు సమాధానం చెప్పమ్మా. పురుషాధిక్య సమాజానికి సమాంతరంగా స్త్రీల ప్రాధాన్యతా క్రమాలు మారాయి. నిజమే నువ్వెంతో సాధించాలి. ఇంకా సాధిస్తావు కనుక నీ ఆరోగ్యం గురించి కాస్త ప్రాధాన్యం ఇచ్చుకో. నీ స్వభావం మార్చుకో. సున్నితం గానే ఉండు. కానీ ఆరోగ్యంగా ఉండు. తమ ఆకలి పట్టించుకోని, ఆరోగ్యం పట్టించుకోని, ఎప్పుడూ కుటుంబ శ్రేయస్సే ఆలోచించే మహిళా లోకం అందరికీ హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. నీహారికా ఇది నువ్వు గుర్తుంచుకోదగిన కానుకే అనుకొంటాను.

Leave a comment