గంగవల్లి, గంగవాయిల కూర గా పిలిచే ఈ గడ్డిమొక్క చిన్నచిన్న పువ్వులతో ఎంతో అందంగా ఉంటుంది.ఈ మొక్క ఆకుల్లో నీటిని నిల్వ చేసుకునే శక్తి ఎక్కువ గనుకే ఆకులు ఉబ్బెత్తుగా ఉంటాయి.ఈ మొక్కలో ఆకులే కాదు కాండము పువ్వులు అన్నీ తినొచ్చు.ఈ గడ్డి రకం ఆకులను  సలాడ్ల లో ఆమ్లెట్ లో కూడా వాడుతారు.ఏ రకమైన ఉదయాన్నే కోసి వండు కోవటమే మేలు రాత్రి వేళల్లో ఆకుల్లో ఎక్కువగా ఉండే కార్బన్డయాక్సైడ్,మాలిక్ ఆమ్లం గా మారుతోంది ఎండెక్కేకొద్ది అది కాస్త గ్లూకోజ్ గా మారిపోతుంది అందుకే దాన్ని ఉదయాన్నే కోసి వండితే రుచిగా ఉంటుంది చర్మానికి ఎంతో మేలు చేస్తుంది.ఈ ఆకు ఇందులో అధికంగా ఉండే విటమిన్-ఎ  విటమిన్-ఇలు  చర్మం ముడతలు పడకుండా కాపాడతాయి.ఇవి చుక్క నీళ్ళు అందుకున్న వేళ్ళు భూమి లోపలికంటాపోయి నీళ్లు పోషకాలు పిలుచుకొని ఎదుగుతుంది చిన్న కుండీలలో కూడా చక్కగా బతుకుతుంది.

Leave a comment