Categories
ఇంట్లో వినియోగించే ఫ్లాస్టిక్ వస్తువుల సంఖ్య రోజు రోజుకీ పెరిగి పోతుంది. ప్లాస్టిక్ ఆట వస్తువులు, మంచి నీళ్ళ సీసాలు, భోజనం తీసుకుపోయే బాక్సులు ,డైనిండ్ టేబుల్ అలంకరణ మొత్తం ప్లాస్టిక్ మయం. దుస్తులు కూడా ప్లాస్టిక్ ఫైబర్ తోనే తయారు చేస్తున్నారు. ఈ ప్లాస్టిక్ వస్తువుల రేణువులు ఇల్లంతా పరుచుకుంటున్నాయి అంటున్నారు డాక్టర్లు. భోజనం చేసే సమయంలో చుట్టు ఉన్న స్లాస్టిక్ సామాను నుంచి 140 నుంచి 150 ప్లాస్టిక్ రేణువులు కడుపులోకి పోతాయట. వీటిని దృష్టిలో ఉంచుకొని ప్లాస్టిక్ నిలిపి వేయమంటున్నారు డాక్టర్స్.