Categories
WhatsApp

ఏడవడం వల్లనూ ఆరోగ్యం.

పాతకాలం సినిమాల్లో ఏడుపు సీన్లు ఎన్నో ఉండేవి. ప్రేక్షకులు కుడా యధా శక్తి కన్నీళ్ళు పెట్టుకుని సినిమాను వంద రోజులు ఆడించేవారు. అది సినిమా వరకే నిజ జీవితంలో ఏడవడం ఎవళ్ళు ఇష్టపడని సబ్జెక్ట్. నిబ్బరంగా వుండాలని కన్నీళ్ళను ముని పంటి తో నొక్కి అపుకోవాలని పాఠాలు వింటాం కానీ ఏడుపు బాధ తేవ్రతనిఉ తగ్గిస్తుంది అంటున్నాయి రిపోర్ట్స్. ఒక అద్యాయినం ప్రకారం కన్నీళ్ళు మానసిక వత్తిడిని తగ్గిస్తాయి. శరీరం లోని విశాతుల్యాలని తొలగించి స్వస్థత చెందేందుకు సాయపడతాయి. అంతే కాదు హాయిగా ఎదవగాలిగిన వాళ్ళు శారీరకంగా ఆరోగ్యంగా వుంటారు. ఏడుపు వల్ల  మేడలో నొప్పి కారక ఎంజైమ్స్ విడుదల అవ్వుతాయి అంచేత బాధ కలిగితే మనసారా ఏడవండి నొప్పి తీవ్రత తగ్గుతుంది అంటున్నారు. ఈ అద్యాయినం ప్రకారం ఏడుపు వాళ్ళను చాలా లాభాలున్నాయి.

Leave a comment