Categories
ఎలాగొలా శరీరాన్ని యాక్టివ్ గా ఉండేలా చేయడం ముఖ్యం ఇందుకోసం పరిగెడతారా, నడుస్తారా, యోగానా, వర్కవుట్లా ఏదో ఒకటి. జీవన శైలిలో వ్యాయామం పార్ట్ గా వుంటే చాలు. అలాంటి అనేకానేక పద్ధతుల్లో ఎక్కువ ఉపయోగపడేది సైకిల్. వ్యయమ సైకిల్ తొక్కడం వలన ఎన్నో ప్రయోజనాలు. ముందుగా శ్వాసకోస వ్యవస్థ ధృడపడుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నడుము కింది భాగంలో కండరాలకు ఇది మంచి వ్యాయామం. నడుము, కాళ్ళు, పిరుదుల్లో పేరుకున్న కొవ్వు కరిగిపోతుంది. కేవలం ఒక్క అరగంట పాటు ప్రతి రోజు ఈ సైకిల్ తొక్కినా చాలు. బరువు తగ్గాలంటే ఇది మంచి వ్యాయామం. రోజుకు ఇరవై నిముషాలు పాటు చేసినా అనుకున్న ఫలితం సాధించవచ్చు.