మెడ పైన చర్మం నల్లగా అయిపోయి వదలకుండా ఉంటుంది ఒక స్పూన్ శనగపిండి, అర స్పూన్ బియ్యం పిండి, పావు స్పూన్ పసుపు కలిపి పాలు నిమ్మరసం కలిపి పేస్ట్ లా చేసి మెడ చుట్టూ పట్టించి పావు గంట తర్వాత చెయ్యి తడి చేసుకుంటూ మెడ చుట్టూ మృదువుగా స్క్రబ్ చేసి గోరువెచ్చని నీటితో కడిగేయాలి. చర్మం పై నలుపు పోగొట్టడం లో బంగాళదుంప మంచి బ్లీచింగ్ మాదిరి పనిచేస్తుంది.బంగాళదుంప గ్రైండ్ చేసి రసం తీసి ఆ రసం అప్లై చేసి కాసేపు ఆరిపోయాక కడిగేయాలి. ఇలా చేస్తూ ఉంటే మెడ పైన నలుపు పోయి చర్మం మెరుస్తుంది.

Leave a comment