కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద కూర్చుని భోజనం చేస్తే ఎంత బాగుంటుందో కదా!!దీనినే “వన భోజనం” అంటారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,విశాఖపట్నం జిల్లా, ఆనందపురం మండలం,గుడిలోవ గ్రామంలో ఉన్న రంగనాథస్వామి ఆలయానికి వెళ్ళి ప్రకృతి ఒడిలో హాయిగా సేద తీరి స్వామిని దర్శనం చేసుకుని కటాక్షం పొందుదాం.మూడు కొండల నడుమ మనకు స్వామి ప్రత్యక్ష మవుతాడు.పురాతన కట్టడమైన ఈ ఆలయ గర్భ గుడిలో నాగశేషుడు నివాసం ఏర్పాటు చేసుకొన్నాడని,ఈ ఆలయానికి కొద్ది దూరంలో శ్రీ మహావిష్ణువు పాదాలు,శ్రీ చక్రం,శ్రీ నారాయణేశ్వరాలయం, ఇక్కడ శివలింగం  స్వయంభుగా వెలసినది.
కొండలలో నుంచి జలపాతం ప్రవహిస్తూ,చూడచక్కని ఉసిరి చెట్లు కార్తీక మాసంలో వన భోజనాలకు ఆహ్లాదంగా ఆహ్వానిస్తోంది.

నిత్య ప్రసాదం: కొబ్బరి,పులిహోర,దద్ధోజనం,అభిషేకాలు.

            -తోలేటి వెంకట శిరీష

Leave a comment