Categories

భారత సైన్యం, వైమానిక దళం, నావికాదళం నుంచి 12 మంది మహిళా అధికారులు హిందూ మహాసముద్రంలో 55 రోజుల సముద్ర సాహస యాత్రకు శ్రీకారం చుట్టారు. ముంబై లోని ఇండియన్ నేవల్ వాటర్ మ్యాన్ షిప్ ట్రైనింగ్ సెంటర్ ఈ యాత్ర ప్రారంభ కేంద్రం. 55 రోజుల్లో హిందూ మహాసముద్రం లోని 4000 నాటికల్ మైళ్లను ఈ బృందం చుట్టేస్తారు. సముద్రంలో ప్రపంచాన్ని చుట్టి వచ్చిన సాహసికులుగా త్రివిధ దళాల మహిళా జట్టు ప్రపంచ రికార్డు నెలకొల్పుతారు.7వ తేదీ నుంచి ఈ యాత్ర మొదలైంది.