రాజ్ పదంలోనే అందం,రాయల్టీ అన్ని ఉన్నాయి ప్రాచీన భారతీయ సాంప్రదాయ వైభవం ఉట్టిపడే నగలే మా ప్రత్యేకత అంటుంది జ్యువెలరీ డిజైనర్ పురిమాసేధ్. 1981 లో ప్రారంభమైన ‘ది హౌస్ ఆఫ్ రోజ్’ నగల వ్యాపారానికే ఒక గ్లామర్ సెట్ చేసింది. ముంబై ఒపేరా హౌస్ లోని ఒక్క చిన్న గదిలో ప్రారంభమైన ఈ డిజైనర్ జ్యువెలరీ షో.అతి తక్కువ కాలంలోనే అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది.  వైవిధ్యమైన డిజైన్ నాణ్యతే బ్రాండ్ వాల్యూ ఢిల్లోలో దీనికో స్టార్ ఉంది. లండన్ హాంకాంగ్,దుబాయ్ అబుదాబీల్లో జ్యూవెలరీ ఎగ్జిబిషన్స్ జరుగుతాయి.చాలా అందమైన అద్భుతమైన జ్యువెలరీ డిజైన్స్ ఎన్నో ‘ది హౌస్ ఆఫ్ రోజ్’ లో చూడచ్చు.

Leave a comment