Categories
Status Post

తక్షణ శక్తికి చెరుకు రసం

ఈ సీజన్ లోనే చెరుకు రసం బాగా దొరుకుతుంది. పైగా టేస్టీగా, చల్లగా, సహజంగా వుంటుంది కనుక అoదరూ ఇష్టపడతారు. ఎండలో అలసిపోయి వచ్చాక ఒక్క గ్లాసు చెరుకు రసం తాగితే చాలు తక్షణ శక్తి వస్తుంది. కోబాల్ట్, మెగ్నీషియం వంటి ఖనిజాలు, యాంటి ఆక్సిడెంట్లు, ప్రోటీనులు, పైటో న్యూట్రియంట్లు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. చెరుకు రసం కాలేయం, మూత్ర పిండాలని ఆరోగ్యంగా ఉంచుతుంది. చెరుకు రసంలో నిమ్మరసం కలిపి తాగితే బరువు పెరగరు. చెరుకులో ఇనుముతో పాటు ఫోలేట్ శాతం కూడా ఎక్కువే. హెమోగ్లోబిన్ శాతం కూడా పెరుగుతుంది. గర్భిణులు చెరుకు రసం తాగితే గర్భస్థ శిశువు లోపాల్ని అరికట్టవచ్చు. చెరుకు రసాన్ని తరచూ తీసుకుంటే మలబద్దకం తొలిగిపోతుంది. సహజసిద్ధమైన లాక్సేటివ్ గుణాలు దాన్లో ఉన్నాయి. కడుపులో మంట, అసిడిటీ వంటి సమస్యలు తగ్గిస్తుంది. అలసట తొలిగిపోతుంది.

Leave a comment