Categories
Nemalika

పెద్ద వాళ్ళ కష్టం తోనే పిల్లల గుర్తింపు.

నీహారికా,

చాలా మంది బాల మేధావుల పరిచయాలు, ఫోటోలు చూస్తుంటాం. కొందరిలోనే సృజన వుంటుంది అనుకోనక్కరలేదు. ప్రతి మనిషిలో ఎదో కొంత శక్తి ఉంటూనే వుంటుంది. పిల్లల్లో మేధా శక్తి వెయ్యింత లై టి.విలు, పబ్లిక్ ప్రోగ్రామ్ల వరకు వచ్చిందంటే దాని వెనుక తల్లి దండ్రుల కృషి ఎంతో వుంటుంది. వాళ్ళు తమ పూర్తి సమయం కేటాయించి పిల్లలతో గడిపి, వాళ్ళను గురువుల వద్దకు ఎంతో శ్రమ పది తీసుకు పోయి, అక్కడ నేర్చుకున్నవి ఇంటి దగ్గర జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయించి, ఎన్నో తంటాలు పడితేనే కానీ, పిల్లలు వృద్ది లోకి వస్తారు. అలా ఏ  పిల్లలనైనా ప్రోత్సహించవచ్చు, వాళ్ళతో కలసి పోయి జీవించాలి. వాళ్ళతో పాటు కధలు, కవితలు, పాటలు, పద్యాలు, పాడాలి. నృత్యం నేర్పించాలి. ఏ లెక్కల్లోనో ప్రావిణ్యం ఉందనిపిస్తే, ఆ సబ్జెక్ట్ పైన గ్రిప్ వచ్చే దాకా పిల్లల చేత చదివించాలి. ఎంతో కర్చు పెట్టాలి, ఎంతో శ్రమకు ఓర్చుకోవాలి. అప్పుడే పిల్లల్లో వుండే సృజనాత్మక బయటికి వస్తుంది. అంటే గానీ పిల్లలంతట పిల్లలే  తెల్లారేసరికి అన్నీ నేర్చుకోలేరు.

Leave a comment