Categories
Sogasu Chuda Tarama

మంచి రంగునిచ్చే పెరుగు పూత

కమ్మని పెరుగులో సౌందర్య పోషణకు పనికి వచ్చే గుణాలు ఎన్నో ఉన్నాయి. పెరుగులో ఉండే లాక్టిక్ ఆమ్లం చర్మానికి మంచి రంగు ఇస్తుంది. మృదువుగా మారుస్తుంది. పెరుగు ముఖానికి రాసుకుని ఓ పది నిముషాలు అలాగే వదిలేస్తే ముఖంపై మచ్చలు, ముడతలు పోతాయి. పెరుగు, తేనె కలిపి అప్లయ్ చేస్తే మరీ మంచిది. మెడ పైన నల్లగా అనిపిస్తే పుల్లటి పెరుగు పట్టించి 15 నిముషాలు వుంచి కడిగేస్తే క్రమంగా కొన్ని రోజులకు నలుపు తగ్గిపోతుంది. మొహంపైన మొటిమలకు పెరుగు సహజమైన మంచి మందు. క్రమం తప్పకుండా ప్రతిరోజు పుల్లటి పెరుగు రాస్తే మొటిమలు తగ్గుతాయి. సెనగ పిండి, పెరుగు మిశ్రమం ముఖం, మెడ, కాళ్ళు, చేతులకు రాసి 15 నిముషాలు ఆగి స్నానం చేస్తే చర్మం మృదువుగా ఉండటమే కాదు కాంతివంతంగా మెరిసిపోతుంది. పెరుగులో నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుంటే చాలు, రాస్తూ ఉండగానే ముఖం కాంతిగా మారటం తెలిసిపోతూ వుంటుంది. చేతులకు, గోళ్ళకు కూడా ఈ మిశ్రమం మంచి మెరుపునిస్తుంది.

Leave a comment