100 కేజీల కూల్ కేక్ ముక్కలతో  మిలన్ బార్బీ క్యాథడ్రెల్‌ నమూనా నిర్మించిన లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ తెచ్చుకుంది పూణే కు చెందిన ప్రాచీ ధబాల్ దేబ్ బ్రిటన్ కు చెందిన ఒక పురాతన చర్చి క్యాథడ్రెల్‌ చర్చ్‌. గుడ్లను వాడకుండా వీగన్ పదార్థాలతో కేక్ ముక్కలు డిజైన్ చేసి చర్చ్‌ రూపం తెచ్చేందుకు ప్రాచీ కి నెల రోజులు పట్టింది. 6 అడుగుల 4 అంగుళాల పొడవైన నిర్మాణం. ఈ రాయల్ ఐసింగ్ కేక్. నాలుగు అడుగుల ఎత్తు మూడు అడుగుల పది అంగుళాల వెడల్పు తో తయారు చేసిన ఈ ఐసింగ్ కేక్ బరువు 100 కేజీల పైన ఎంతో సంక్లిష్టమైన నిర్మాణాలను కేక్ లుగా రూపొందించడంలో ప్రాచీ కి నైపుణ్యం ఉండటం వల్లనే గత సంవత్సరం ఫెమీనా అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో చోటు దక్కించుకుంది.

Leave a comment