వసంత పంచమి శుభాకాంక్షలు !!

వరవీణా మృదుపాణి వనరుహలోచను రాణి..సురుచిర బంబరవేణి సురనుత కల్యాణి!!
వసంతాలను స్వాగతిస్తూ వచ్చేసింది వసంత పంచమి.ఈ రోజు సర్వవిద్యల యందు ఙ్ఞానాన్ని ప్రసాదించి ఆ తల్లి చల్లని చూపులతో అలంకరించుకుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి.పుస్తకం, కలము అమ్మవారి దగ్గర పూజలో పెట్టి పూజించాలి.సంగీతం,నృత్యం, సాహిత్యాలతో అమ్మని ఆరాధన చేయాలి. వసంత పంచమి రోజు పిల్లలకు అక్షరాభ్యాసం చేసిన ఉత్తమమైన కార్యక్రమం. శారదా దేవి రూపంలో వరాలు ప్రసాదిస్తుంది.శ్రీ బాసర సరస్వతీ ఆలయం, వర్గల్ అమ్మవారు భక్తులతో కిటకటలాడుతుంది.మహాసరస్వతి,నీల సరస్వతి, సిధ్ధ సరస్వతి అని పలు నామములతో కొలువు తీరి భక్తులు తమ కోరికలు తీర్చే తల్లి తన అభయ హస్తంతో ఆసీనురాలై వుంది.

నిత్య ప్రసాదం: కొబ్బరి,తీపి పదార్థాలు,అరటిపళ్ళు.

-తోలేటి వెంకట శిరీష

Leave a comment