Categories
Soyagam

సముద్రపు ఉప్పు నీటితో ఈ మసాజ్.

వయస్సు పెరిగే కొద్దీ చర్మం సాగిపోతుంది. వృద్దాప్య ఛాయలు మొహం పై స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. మోచేతుల పై సాగి పోయి కనిపిస్తంది. శరీరం లో కొల్లాజెన్ ఉత్పత్తి నెమ్మదించినప్పుడే ఇలాంటి పరిస్థితి వుంటుంది. ఈ చర్మాన్ని మాములు స్థితికి తీసుకు రావాలంటే సముద్రపు ఉప్పును నీటిలో కరిగించి ఆ నీటిని స్కెచ్ పాడ్ పై ముఖం పైన మోచేతుల చర్మం పైన మృదువుగా రుద్ది చన్నీళ్ళుతో కదిగేయోచ్చు. చర్మం బిగుతు కోసం స్ట్రాబెర్రీ, తేనె మిశ్రమం కూడా బాగా పనికొస్తుంది. రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేసే ఆముదం కూడా సాగిన చర్మానికి మంచి మందులా పనిచేస్తుంది. ఆముదంతో మర్దనా చేసి చూడొచ్చు. అవిసె గింజల్ని పొడి చేసి అందులో నిమ్మరసం వేసి కలిపి స్క్రుబ్ చేసినా మంచి ఫలితం వుంటుంది. విటమిన్ సి పుష్కకలంగా వుండే ఈ రెంటిలోనూ యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా వున్నాయి. ఈ మిశ్రమం రాసి ఆరనిచ్చి పది నిమిషాల తర్వాత చల్లని నీళ్ళతో కడిగేస్తే ఫలితం తెలుస్తుంది.

Leave a comment