నేను ఒకేసారి ఇంగ్లీష్ కన్నడ రాయగలను, మిమిక్రీ సింగింగ్ కూడా అంటోంది 16 ఏళ్ల ఆది స్వరూప.కర్ణాటకలోని మంగళూరు కు చెందిన ఈ అమ్మాయి 45 మాటలను ఒక్క నిమిషంలో రెండు చేతులతో రాసేయగలదు.మిమిక్రీ, రూబిక్స్ క్యూబ్,మ్యూజిక్ వంటి రంగాలలో జాతీయ ప్రపంచ రికార్డు సాధించాలని కృషి చేస్తున్నాను అంటుంది ఆది స్వరూప. 2018లో రూబిక్స్ క్యూబ్ మొజాయిక్ లో తల్లి సుమంగళ సుమాద్కర్ తో కలిసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది స్వరూప. 2021లో దీన్ని నేను ఒంటరిగా ఈ ఫీట్ చేయాలనుకున్నాను అంటుంది స్వరూప రెండేళ్ల వయసు నుంచి రాయడం ప్రారంభించిన స్వరూప రెండు చేతులనూ ఉపయోగించి 10 రకాల పద్ధతుల్లో ను  కళ్లకు గంతలు కట్టుకొని కూడా రాయగలదు.

Leave a comment