ఇప్పుడు మనం కరోనా గురించి భయపడుతూ ఉన్నాము కానీ 1918లో స్పానిష్ ఫ్లూ వచ్చింది. అప్పుడు ప్రపంచ వ్యాప్తంగా 100 మిలియన్ల మంది మరణించి ఉంటారని ఒక అంచనా. ఈ ఫ్లూ స్పెయిన్ కి సంబంధం లేకపోయినా ఈ మహమ్మారి గురించిన వార్తలు స్పెయిన్ మీడియా ఎక్కువ ప్రచురించడంతో ఇది స్పెయిన్ ఫ్లూ గా పేరు తెచ్చుకుంది. అప్పటి పోస్టర్ ఇది మాస్క్ తొడుక్కో చేతులు కడుక్కో దూరం పాటించు ముఖాన్ని ముట్టుకుంటే తదుపరి నాదే మరణం అని హెచ్చరికతో ఉన్న పోస్టర్ ఇది. కొత్త వాళ్ళని ఇంట్లోకి రానివ్వకుండా ఇంత పెద్ద తలుపులు బలవంతంగా మూసేస్తూ ఉన్న పోస్టర్. వందేళ్ల తరువాత మళ్ళీ ఇవ్వాల్టి జీవనానికి ప్రతిరూపం.

Leave a comment