మన శ్వాస మన ఆరోగ్యం గురించి చెబుతుంది.దాన్ని వినాలి అంటుంది 101 సంవత్సరాల యోగా టీచర్ పోర్బన్ లింబ్. ఇప్పటికి ఎంతో ఉత్సహంగా యోగా,డాన్స్ చేసే ఈ వృద్ద యోగా టీచర్ న్యూయార్క్ సిటీలో తన స్టూడెంట్స్ కి యోగా పాఠాలు నేర్పుతుంది.ఆమె తన ఏడేళ్ళ వయసులో ఇండియాలో యోగా నేర్చుకుంది. అప్పట్లో యోగా పురుషుల కోసం అనే వాళ్ళు కాని పోర్బన్ దీన్ని అబ్బాయిలాగే నేర్చుకుని సాధన చేస్తా అంటుంది. ఈ మధ్య కాలంలో ప్రధాని మోడీ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డ్ అందుకుంది కూడా. యోగా జీవిత కాలాన్ని పొడిగిస్తుంది. ఆరోగ్యాన్ని ఇస్తుంది అనేందుకు ఈ యోగా టీచర్ చక్కని ఉదాహరణ.

Leave a comment