క్వాంటికొ అనే టి.వి షో లో నటిస్తున్న ప్రియాంకా చోప్రా వాణిజ్య ప్రకటనలు, ఇతర కార్యక్రమాల ద్వారాసంపాదించిన మొత్తంలోనే అత్యధికంగా సంపాదిస్తున్న టి.వి నటిగా ఫోర్బ్స్ పత్రిక జాబితాకు ఎక్కింది. బాలీవుడ్ లో చాలా కాలం నుంచి స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న వాళ్ళు ప్రియాంక చోప్రా టాప్ ర్యాంక్ అని చెప్ప వచ్చు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. మేరికొమ్ లాంటి బయో పిక్స్ లో అలరించిన ప్రియాంక ఇటీవలే అస్సాం టురిజంకు బ్రాండ్ అమ్బసిడర్ గా ఎంపికైంది. దానికి సంబందించిన కార్యక్రమాల్లో ఒక అంతర్జాతీయ పర్యాటక సంస్థల ప్రతి నిధులతో మాట్లాడుతూ ఆడవాళ్ళు ఇప్పుడు అన్ని రంగాల్లో విజయాలు సద్ధిస్తున్నారని వాళ్ళని వేరు చేసి చూడవలసిన అవసరం లేదన్నది. స్త్రీ, పురుషుల మధ్య వుండే గాఢమైన అనుబంధం వాళ్ళు ఆనందానికి హేతువు అవుతుందని చెప్పింది ప్రియాంక.

Leave a comment