ప్రసవం అయిన మొదటి నెలల్లో పాపాయి పెంపకం తల్లులకు చాలా ఒత్తిడి అనిపిస్తుంది . పిల్లలకు ఏం కావాలో,వాళ్ళకు ఇంకా ఎలాటి సౌకర్యమైన జీవితం ఇవ్వాలో ,వాళ్ళ ఏడులపు ను నిద్రని ఎలా అర్ధం చేసుకోవాలో తెలియక తల్లులు ఎంతో ఆందోళన పడతారు . ఒక సంవత్సరంలో ఈ ఆందోళన పడే గంటలు మొత్తం 1400 గా అమెరికాకు చెందిన ఎన్ పామిచ్ అనే సంస్థ గుర్తించి 900 మంది తల్లులకు ,వంద మంది పిల్లల వైద్యులను సంప్రదించిన ఈ సర్వేలో ఈ విషయం రుజువైంది . ఈతరం తల్లులు 330 గంటలు గూగుల్ లో పిల్లలకు సంబంధించిన రకరకాల సమస్య లు గురించి వెతుకుతున్నారు మరో 330 గంటలు తమ తల్లులు ఇతర కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి తమ ఆందోళనలు చెపుతున్నారు ఇక మిగతా సమయం పిల్లల ఆహారం ,జీర్ణం ,ఏడుపు వంటి విషయాల గురించే ఆలోచిస్తూ ఉంటారని ఈ సర్వే చెపుతోంది .

Leave a comment