ప్రపంచం లోనే ఖరీదైన పూలు అంటే ఎంత వుండి  వుంటాయో ఊహించండి. వెయ్యి పదివేలు లక్ష …. ఎంతవరకైనా పర్లేదు. ఏకంగా 30 కోట్ల రూపాయలకు ఈ పూలను కొనుకున్నారట ఒక పెద్ద మనిషి. దానిపేరు జూలియట్ రోజ్. నిజంగానే ఈ అద్భుతమైన పూవు ఖరీదు 30 కోట్ల రూపాయలే. మరి పదిహేడేళ్లు ఎదురు చూసారు. ఈ పూవు వికసించటం కోసం డేవిడ్ ఆస్టిన్ అనే ప్రపంచ ప్రఖ్యాత నర్సరీ నిర్వాహకుడి తోటలో ఇది పూసింది. పదిహేడేళ్ల పాటు ఎన్నో ప్రయోగాలు చేసి ఈ కొత్తదనం రోజు సృష్టించాడు. ఒక పూల ప్రదర్సనలోమొదటిసారి వీటిని ప్రపంచానికి పరిచయం చేస్తే ఆ పూల అందానికి ఆకృతికీ పరిమళానికి ముగ్ధుడై ఒక వ్యక్తి వేలం పాట లో ముఫై కోట్ల రూపాయలకు సొంతం చేసుకున్నారు. ఈ రకం రోజులలో  ఇది మొదటిడి కాబట్టి దానికింత ధర.

 

 

 

 

 

Leave a comment