ఈ సర్వే  ఎప్పుడూ తారలు మరీనా మారని మహిళల జీవిత చిత్రంలా కనిపిస్తూవుంటాయి. నాలుగు దేశాల్లో చేసిన ఒక సర్వే లో మహిళలు 19 సంవత్సరాలలోపు నుంచే ఎన్నో రకాల వేధింపులకు లోనవుతున్నారని  తేలింది. మన దేశంలో పదిమంది ఆడవాళ్ళలో నలుగురు ఇలాంటి హింసలకు గురవుతున్నారు. గత నెలలో 73 శాతం మంది మహిళలు ఎదో ఒక రూపంలో హింస లేదా వేధింపులు ఎదుర్కొన్నారు. గత నెలలో శరీరం పై తగలరాని చోట తమను తడిమారని ప్రతి నలుగురు మహిళల్లో ఒకరు చెప్పారు మన దేశంలో ఆరు శాతం మంది ఆడపిల్లలు పది సంవత్సరాలు నిండకుండా వేధింపులు హింసకు లోనవుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఎదుర్కుంటున్న పదేళ్ల లోపు ఆడపిల్లలు బ్రెజిల్ లో 16 శాతం  బ్రిటన్ లో 12 శాతం థాయిలాండ్ లో ఎనిమిది శాతంగా ఉన్నారు. వేధింపులకు గురికాకుండా తగిన రక్షణ చర్యలు అనుసరిస్తున్నట్లు ఇండియా లోని 82 శాతం స్త్రీలు చెప్పారు. 35 శాతం పార్కులు లైట్లు లేని చోట్లకు వెళ్ళటం తగ్గించారు. 36 శాతం నిత్యం తాము ప్రయాణించే రూట్ మార్చారు. రేప్ అలారం మిరియాల పొడి లాంటివి రక్షణగా వాడుతున్నారు.

Leave a comment