ఆరేడేళ్ళ పిల్లలు ఎన్నో సార్లు నోట్లోకి వెళ్ళు పోనిచ్చేస్తూ ఉంటారు. ఒక్కరోజు మూడు నాలుగు వందల సార్లు చేతులు నోట్లోకి పోతూ ఉంటాయి. అదే సమయంలో బాల్ అడతారు. సైకిల్ తొక్కుతారు జంతువులతో ఆడుతుంటారు. మురికి లో ఎక్కడ పడితే అక్కడ జంతువులతో ఆడతారు. మురికి లో ఎక్కడ పడితే అక్కడ చేతులు పెడతారు. ఇదే చేతులు నోట్లోకి వెళ్ళిపోతుంటాయి. ఇక అప్పుడు ఎన్ని సార్లు పిల్లల చేతుల్ని యాంటీ బాక్టిరియల్ వైప్స్ తో తుడవాలి. ప్రతి పది నిముషాలకు ఓ సారి సింక్ దగ్గరకు తీసుకు వెళ్ళి కడగాలి. ఇదే భయపడతారు తల్లి దండ్రులు. కానీ అంత శ్రమ అక్కర్లేదు అంటారు ఎక్స్ పర్ట్స్ ఆటలయ్యాక, జంతువులతో  ఆడటంముగిసాక భోజనం ముందర చేతి వేళ్ళ వెనక, వేళ్ళ సందులో, మాములు సబ్బుతో 20 సెకెండ్ల పాటు కడిగినా చాలు. దీని వల్ల హాని కలిగించే క్రీములు పోతాయి. ఈ మాత్రం శుబ్రత చాలంటున్నారు డాక్టర్లు.

Leave a comment