ఎంతో డబ్బు పెట్టి బంగారం కొంటాం కానీ అమ్మడం మాత్రం కష్టమే నష్టం కుడా. నగల్ని మార్చే బదులు, కొత్త కొత్త మోడల్ లో అదే బంగారు నగలు అమ్మాలంటే బిల్లులు గనుక వుంటే నూటికి నూరు శాతం ధరలో మార్పిడి చేసుకునే వీలుంటుంది. ముత్యాల నగలైతే ప్రపంచ వ్యాప్తంగా మార్పిడి రాటు లేదు. రాళ్ళ నగలు కొన్నప్పటి కంటే అమ్మేటప్పుడు, 20 శాతం తక్కువకే మార్పిడి రాటు వస్తుంది. 18 క్యారెట్ల బంగారు నగలకు మంచి మార్పిడి రాటు వుంటుంది. నగల మార్పిడికి వెళ్ళేటప్పుడు బిల్ తీసుకోవాలి. 916 హాల్ మార్క్ వున్న నగాలకే మార్పిడి రేటు ఎక్కువగా వుంటుంది. నగలు అమ్మాలంటే వాటిని గవర్నమెంట్ హాల్ మార్కింగ్ సెంటర్ కు వెళ్లి ప్యురిటి చెక్ చేయించి నగలకు ఎంత డబ్బు వస్తుందో తెలుసుకుని ఆ తర్వాతే నష్టం లేకుండా అమ్మొచ్చు.

Leave a comment