ఈ ఏడాది కలర్ గా క్లాసిక్ బ్లూ ,లేదా రాయల్ బ్లూ ని ఎంపిక చేశారు నిపుణులు . ఊదా కలిసిన నీలంరంగు నిజానికి యూనివర్సల్ పేవరెట్ . నీలిరంగు కెమెరా కాచింగ్ కలర్ ఎన్నో కంపెనీల లోగోలు ఆరంగులోనే మెరుస్తాయి . కార్పొరేట్ సంస్కృతి లో నీలం షూట్ ప్రొఫెషనలిజానికి ప్రతీక నీలం రంగుకు జోడిగా పసుపు నారింజ గులాబీ కాంట్రాస్ట్ కలర్స్ లో ఏ రంగయినా నప్పుతుంది .రిచ్ లుక్ కోసం మెటాలిక్ సిల్వర్ గొట్టిన జరీ కలర్ ఉంటె బావుంటుంది అంటారు ఫ్యాషనిస్ట్ లు . ఈ సంవత్సరం అందమైన చీరెలన్నీ నింగి నీలాన్ని మరిపించే వర్ణంలోనే డిజైన్ చేసారు నిపుణులు . అవకాశాన్ని నిజాయితీని ,శక్తి నీ ప్రతిబింబించే నీలిరంగు చీరె ఒక్కటైనా ఈ సంవత్సరం మీ వర్డ్ రోబ్ లో ఉంచుకోండి .

Leave a comment