మూడు కిచెన్ రూల్స్ ని తప్పక పాటించండి మీ ఆరోగ్యం దివ్యంగా ఉంటుంది అంటున్నారు ఫిట్ నెస్ ఎక్స్ పర్డ్ రజుత దివాకర్ . వంటగదిలో ఈ మార్పులు ప్రవేశపెడితే చాలు ఎన్నో అనారోగ్యాలు దగ్గరకు కూడా రావు అంటున్నారు . పాతకాలపు వంటిళ్లలో వాడే ఇనుప పెనాన్ని వెంటనే కొనుక్కు రండి,అలాగే మైక్రోవేవ్ లో పదార్దాలకు మళ్ళీ మళ్ళీ వేడిచేయకండి ,ప్లాస్టిక్ ఉపయోగించటం పూర్తిగా మానేయండి వంట ఇంటి వస్తువులు శుభ్రం చేసేందుకు ప్లాస్టిక్ ప్యాకింగ్ చేసిన ద్రవాలను మానేసి మాములు సబ్బు వాడుకోవాలి . కిరాణా వస్తువుల కోసం గుడ్డ సంచులు వాడడం ,వంట గదిలోంచి ప్లాస్టిక్ వస్తువులు తీసేయటం ముఖ్యం . రక్త హీనత తో పోరాడేందుకు ఇనుము ఎంతో సాయం చేస్తుంది . ఇనుప కడాయిలో ఆహారం వండితే అది ఎంతో ఆరోగ్యకరమైన భోజనం అవుతుంది . అలాగే ఆహారం మైక్రోవేవ్ లో వేడిచేసిన ఆహారంలో ఉండే బాక్టీరియా మరింత ప్రమాదకరం. ఈ మూడు సూత్రాలు పాటిస్తే సగం అనారోగ్యాలు తగ్గినట్లే అంటున్నారు రజుత దివాకర్ .
Categories