మామ్ సక్సెస్ తో శ్రీదేవి ఎంతో సంతోషంతో వుంది. మామ్ లో శ్రీదేవిది తల్లి పాత్ర. బయటికి వెళ్ళిన ఆడపిల్ల క్షేమంగా ఇంటికి రావాలనుకునే సగటు మాతృమూర్తి. ఈ సినిమాకు శ్రీదేవి సొంత జీవితానికి ఎంతో పోలికలున్నాయి ఆమెకు ఇద్దరు పిల్లలు. వాళ్ళ భవిష్యత్తు కోసం ఆరాటపడే తల్లిగా శ్రీదేవి ఎప్పుడూ ఆ పిల్లతోనే కలిసి కనబడుతుంది. నిజానికి పిల్లల పెంపకం కోసం కొన్నేళ్ళ పాటు సినిమాలకు దూరంగా వుంది. మళ్ళీ ఇంగ్లీష్ వింగ్లిష్ తో ఆమె వెండి తెర పైకి వచ్చింది. ఇప్పుడు వచ్చిన మామ్ శ్రీదేవి 300వ చిత్రం.’నా విజయం వెనక చాలా మంది వున్నారు కాఈ ముందుగా తలుచుకోవాల్సింది మా అమ్మనే. మా అమ్మా మా కోసం మొత్తం జీవితాన్ని త్యాగం చేసింది ఎప్పుడు ఇప్పుడు అలసిపోతారు. ఆమె త్యాగంలో సగమైన నేను నా పిల్లల కోసం చేసానో లేదో అంటుంది శ్రీదేవి. ఈ సారి తొండా లోనే ఇంకో సినిమా తో వస్తానంటుంది శ్రీదేవి.

Leave a comment