Categories
ఇప్పుడు నటి సంజన తన గొంతు విప్పింది. మీటూ స్ఫూర్తితో ఆమె తన అనుభవం బయటపెట్టారు. ‘గండహెండాత్తి’ సినిమాలో కన్నడ దర్శకుడు రవి శ్రీవాత్సవ తనతో ఎంతగానో వేధించి,బలవంతపెట్టి 50కి పైగా ముద్దు సన్నివేశాలలో నటింపజేశారు.ఈ చిత్రీకరణ బ్యాంకాక్ లో జరిగినప్పుడు మా అమ్మ వచ్చింది.రెండవ రోజు నుంచే ఆమెను హోటల్ గదికే ఉంచేశారు. నాతో వరసగా ఏడు రోజుల పాటు ముద్దు సన్నివేశాలు తీశారు. ప్రశ్నిస్తే దర్శకుడు నన్ను బెదిరించాడు. అలాగే తెలుగు శివకేశవ్ చిత్రం కోసం బ్యాంకాక్ కు వెళితే నిర్మాత కె.నాగరాజ్ నాతో అసభ్యంగా ప్రవర్తించారు.నేను చాలా కఠినంగా వ్యవమరించటంతో ఆయన వెనక్కి తగ్గారు అంటోంది సంజన .ఈ తరహా వేధింపులు నేను ఖండిస్తాను.నా పోరాటాన్ని కొనసాగిస్తాను అంటోంది సంజన.